మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రేజీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజాగ్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ మూడు పాత్రల్లో నటిస్తున్నాడని, ఒక తండ్రి ఇద్దరు కొడుకు పాత్రలో చరణ్ మెరవనున్నాడని టాక్ నడుస్తుంది. గతంలో కూడా చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో చిత్ర బృందం తెలిపే వరకు వేచి ఉండాల్సిందే.