మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సీఆర్డీఏ అధికారులు ఆందోళనలో పడ్డారు. మూడు నెలల్లో ప్లాట్లు పూర్తి చేసి రైతులకు అందజేయాలని హైకోర్టు ఆదేశించడంతో సీఆర్డీఏ అధికారులు సతమతమవుతున్నారు. ప్లాట్ల అభివృద్ధి పనులు సగంలోనే నిలిచిపోవడంతో, మిగిలిన సగం పనులను మూడు నెలల్లో పూర్తి చేసి రైతులకు అప్పగించే పరిస్థితి కనపడడం లేదు. దీంతో రైతులకు ప్లాట్లు అప్పగించే క్రమంలో సీఆర్డీఏకు పాట్లు తప్పవని తెలుస్తోంది.