రిజర్వ్ బ్యాంకు విధించిన కొత్త క్రెడిట్ కార్డు నిబంధనల అమలుకు సమయం పొడిగించింది. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమలు చేయాల్సి ఉండగా..అక్టోబర్ 1 వరకూ అవకాశమిచ్చింది.
**కొత్త క్రెడిట్ కార్డు నిబంధనలు:**
– కస్టమర్ 30 రోజుల్లోగా క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేయకపోతే, బ్యాంకులు వన్ టైం పాస్ వర్డ్ వెనక్కి తీసుకోవాలి.
– వినియోగదారుడు అప్రూవల్ ఇవ్వకపోతే ఏడు పనిదినాల్లోగా కార్డును మూసివేయాలి.
– క్రెడిట్ కార్డుపై లిమిట్ పెంచేముందు తప్పనిసరిగా స్పష్టమైన అప్రూవల్ అడగాలి.
– క్రెడిట్ కార్డ్ బకాయిల చెల్లింపు నిబంధనలు, షరతులు స్పష్టంగా నిర్దేశించాలి.
– చెల్లించని ఛార్జీలు/పన్నులు వసూలు చేయడం/వడ్డీని కలపడం వంటివి చేయడానికి వీల్లేదు.
-
© Envato
-
© ANI Photo