2028, 2032 ఒలింపిక్స్‌లలో క్రికెట్‌!

© Envato

2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలనే అంశం ఊపందుకుంది. కుదరకపోతే 2032 బ్రిస్బేన్‌ ఒలింపిక్స్‌లో ఈ ఆటను చేర్చడానికి క్రికెట్ ఆస్ట్రేలియా(CA) సన్నాహాలు ప్రారంభించింది. తమ క్రీడా సంస్కృతిలో అంతర్భాగమైన క్రికెట్ ను ఒలింపిక్స్‌లో భాగం చేయాలని కమిటీని కోరింది. మరోవైపు సీఏ మాదిరిగానే బీసీసీఐ కూడా క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో భాగం చేయాలని కోరుతోంది. 2028లో ఈ గేమ్‌ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా ఈ నెలఖరులోగా ఐసీసీ నిర్ణయం చెప్పనున్నట్లు టాక్. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో బర్మింగ్‌హామ్ క్రికెట్‌కు ఆతిథ్యమిచ్చింది.

Exit mobile version