ఈ మధ్యకాలంలో సినీ నటులు, క్రికెటర్లు, వివిధ రంగాల్లోని ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కామన్ అయిపోయింది. ఉత్తరాదిలో అయితే క్రికెటర్లు రిటైర్ అయ్యాక రాజకీయాన్నే వృత్తిగా ఎంచుకుంటున్నారు. ఆ జాబితాలో గౌతమ్ గంభీర్, మనోజ్ తివారీ, అజారుద్దీన్, సిద్దూ, మహ్మద్ కైఫ్ ఇలా మరెందరో ఉన్నారు. వీళ్లలో కొందరు మంత్రులు కూడా అయ్యారు. అయితే, ఈ జాబితాలోకి తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు కూడా చేరబోతున్నారు. ఏపీలోని ప్రముఖ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ కూడా చేయబోతున్నాడట. కాగా, త్వరలో ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది. ఈ క్రికెటర్ సీఎస్కే తరపున బరిలోకి దిగబోతున్నాడు. దీంతో ఐపీఎల్ తర్వాత అంబటి రాయుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకోవాలంటే ఐపీఎల్ అయిపోయే వరకు వేచి చూడాల్సిందే.