ఇండియాను బిగ్ బ్రదర్ తో పోల్చిన క్రికెటర్ జయసూర్య

Screengrab Twitter:

శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం జయసూర్య భారతదేశాన్ని బిగ్ బ్రదర్ అని సంభోదించారు. మీకు ఎప్పటిలాగే పొరుగువాడిగా తెలుసు. మా దేశం పక్కన ఉన్న పెద్ద సోదరుడు మాకు సహాయం చేస్తున్నాడు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నామని జయసూర్య అన్నారు. ద్వీప దేశంలో ప్రజలు ఈ పరిస్థితిని ఎదుర్కోవడం దురదృష్టకరమన్నారు. భారత్ ఇప్పటికే శ్రీలంకకు 40 వేల టన్నుల బియ్యం పంపిణీ చేసింది. విదేశీ మారకపు నిల్వలు బలహీనపడటంతో శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొనసాగుతుంది. దీంతో ఆ ప్రభావం ఇంధనం, నిత్యవసరాల ధరలపై పడింది.

Exit mobile version