వంటవాడు లేక స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తెగ ఇబ్బంది పడుతున్నట్లు ఆయనే స్వయంగా తెలిపాడు. ఒక మంచి వంటవాడి కోసం ఎదురుచూస్తున్నామని.. భారీగా జీతం ఇస్తానన్నా ఎవరూ ముందుకు రావడం లేదని తెగ బాధ పడిపోతున్నాడు. ఇటీవల రూ.170 కోట్లు వెచ్చించి పోర్చుగల్‌లో భారీ భవంతి నిర్మించుకున్నాడు. త్వరలో ఆ ఇంటిలోకి మకాం మార్చనున్నారు. అక్కడ పర్సనల్ కుక్ కావాలని రొనాల్డో ఫ్యామిలీ భావిస్తోంది. చెఫ్‌కు నెలకు రూ.4.5 లక్షల జీతం ఇస్తామని ప్రకటించారు.