అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు 110 అమెరికన్ డాలర్లను దాటిపోయాయి. ఇంతలా ధరలు పెరగడం 2014 తర్వాత ఇదే మొదటిసారి. రష్యా మీద ప్రపంచదేశాలు కఠిన ఆంక్షలు విధించడంతో ధరలు ఇలా పెరిగాయి. రష్యా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆయిల్ సరఫరా చేసే దేశం.