తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. వైకుంఠ కాంప్లెక్సుల్లోని 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారిని 74,998 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మరో 24,852 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం స్వామివారికి హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.