టీమిండియా క్రికెటర్ కేదార్ జాదవ్ రీ ఎంట్రీలో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. రంజీ మ్యాచ్‌లో డంబుల్ సెంచరీ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ముంబయిలోని డీవైపాటిల్ అకాడమీ మైదానంలో అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో 283 పరుగులు కొట్టాడు. ఇందులో 12 సిక్సులు, 21 ఫోర్లు ఉన్నాయి. 90 పరుగులకే రెండు వికెట్లు పడిపోయి మహారాష్ట్ర కష్టాల్లో ఉండగా..జాదవ్ బ్యాటింగ్‌కు దిగాడు. 207 బంతుల్లోనే డబుల్ సెంచరీ కొట్టాడు. 100 స్ట్రేక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. తృటిలో ట్రిపుల్ సెంచరీ చేజారింది.