ఇద్దరు IAS అధికారులు తనను రేప్ చేశారంటూ 21 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్లో అండమాన్,నికోబార్ ప్రధాన కార్యదర్శి కూడా ఉన్నారు. ఈ మేరకు ఆగస్ట్ 22న యువతి ఫిర్యాదు మేరకు FIR నమోదైంది. అక్టోబర్ 1న దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్ ) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిందితుల్లో ఒకరైన నరైన్ దిల్లీ ఫినాన్షియల్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇలాంటి ఆరోపణలపై తాను స్పందించనని, ప్రధానమంత్రి కార్యాలయానికి ఇప్పటికే తన వివరణ ఇచ్చానని నరైన్ చెప్పారు. మరో అధికారి మెడికల్ లీవ్‌లో ఉన్నారు.