TS: సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విరుచుకు పడ్డారు. సీఎస్ సోమేశ్ కుమార్‌ని ఏపీ క్యాడర్‌కి పంపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం గౌరవించాలన్నారు. తెలంగాణలో ఎందరో సీనియర్ అధికారులు ఉండగా.. ఏపీకి చెందిన సోమేశ్ కుమార్‌ని సీఎస్‌గా నియమించడంతో కేసీఆర్ లబ్ధి పొందారని సంజయ్ ఆరోపించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఒక న్యాయం? సీఎస్ సోమేశ్ కుమార్‌కి ఒక న్యాయమా అంటూ ప్రశ్నించారు. ఇకనైనా ఏపీ అధికారులను వారి రాష్ట్రానికి పంపించి.. తెలంగాణ అధికారులను స్వరాష్ట్రానికి తీసుకురావాలన్నారు.