70 ఏళ్ల వ్యక్తి యొక్క కుడి మోకాలి నుంచి దోసకాయ పరిమాణంలోని రాళ్లను తొలగించి అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేశారు ముంబయిలోని రహేజా ఆసుపత్రి వైద్యులు. సంవత్సరం నుంచి తీవ్ర నొప్పితో బాధపడుతన్న అతనికి పది సంవత్సరాలుగా వాపులు ఉన్నాయి. ఆ వ్యక్తిని పరిశీలించిన డాక్టర్ సిద్ధార్థ్ ఎం.షా ‘మల్టిపుల్ జెయింట్ సైనోవియల్ కొండ్రోమాటోసిస్’ అనే అత్యంత అరుదైన పరిస్థితిగా గుర్తించి. ఈ వ్యాధి ప్రతి 1,00,000 మందిలో ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తుందని ఆయన వివరించారు. సాధారణంగా చాలా చిన్నవిగా ఉండే రాళ్లు మధేకర్ విషయంలో చాలా పెద్దగా ఉన్నట్లు గుర్తించారు. 12x6x5.5 సెం.మీ. గా ఉన్న నాలుగు పెద్ద రాళ్లను రెండు ముక్కలుగా చేసి తీసేసినట్లు పేర్కొన్నారు. కాగా, దీనిని ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మోకాలి రాళ్ల తొలగింపుగా ఆయన పేర్కొన్నారు.