నకిలీ సంస్థ చేతిలో పడి థాయ్‌లాండ్‌లో చిక్కుకుపోయిన భారతీయ ఉద్యోగులు ఇటీవల స్వదేశానికి తిరిగొచ్చారు. తమకి రోజువారీ టార్గెట్లు ఉండేవని.. వాటిని చేరుకోకపోతే కరెంట్ షాక్ పెట్టేవారని బాధిత ఉద్యోగి తమ బాధలను వివరించాడు. ‘నిర్జన ప్రదేశంలో ఇరుకైన ఆఫీస్ ఉండేది. డేటింగ్ యాప్‌ల్లో ఉండే సంపన్నులే కంపెనీ టార్గెట్. రోజూ కనీసం 50మందికి కాల్ చేయాలి. లేదంటే కరెంట్ షాక్ పెట్టేవాళ్లు. ఇండియన్ ఎంబెస్సీ సాయంతో ఎట్టకేలకు బయటపడగలిగాం’ అని బాధిత ఉద్యోగి తెలిపాడు.