పోలవరం ముంపు ప్రభావంపై ఈ నెల 13న జరగాల్సిన కేంద్ర జల సంఘం సమావేశాన్ని ఈ నెల 25న నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్రాలకు సమావేశానికి సంబంధించిన వివరాలను కేంద్రం పంపించింది. దిల్లీలో జరిగే ఈ టెక్నికల్ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన చీఫ్ ఇంజినీర్లు హాజరుకానున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు కమిటీలో సభ్యులైన ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్లు కూడా భేటీ కానున్నారు. గత కొద్ది కాలంగా పోలవరం ముంపుపై ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.