అయిదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేశాన్ని యాభై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. దీంతో నాయకత్వ మార్పు, పార్టీని తిరిగి పునర్వైభవంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆదివారం CWC సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సోనియా గాంధీ పార్టీ కోసం గాంధీ కుటుంబం ఏం చేయడానికైనా సిద్ధమని తెలిపింది. కొందరు నేతలు గాంధీ కుటుంబం వల్లే పార్టీకి నష్టమని భావిస్తే, వెంటనే తాను రాహుల్, ప్రియాంక గాంధీలు తమ పదవుల నుంచి తప్పుకుంటామని తెలిపింది. దీనికి CWC ఒప్పుకోలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏకతాటిపైకి తెచ్చేందుకు సోనియా గాంధీ త్వరలో ఓ కీలక సమావేశం నిర్వహించనుందట. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, దేశంలో మరలా పార్టీ వైభవాన్ని పునర్నిర్మించే ప్రణాళికలు చర్చించనున్నారని తెలుస్తోంది.