రష్యా ఉక్రెయిన్పై చేస్తున్న దాడుల్లో కేవలం బాంబులతోనే కాకుండా, సైబర్ దాడులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఐరోపా, ఉక్రెయిన్ భాగస్వామ్యంలో ఉన్న ఇంటర్నెట్ శాటిలైట్పై దాడులు జరిపే అవకాశం ఉందని వార్తలు రావడంతో ఐరోపాలో ఉన్న ప్రజలు ఇంటర్నెట్ బంద్ చేసి ఆఫ్లైన్లోకి వెళ్లారు. అయితే అనుకున్నట్టుగానే రష్యా సైబర్ దాడులు జరిపిందని ఫ్రాన్స్ స్పేస్ కమాండ్ హెడ్ జనరల్ మిచెల్ ఫ్రైడ్లింగ్ తెలిపారు. ఈ దాడి కారణంగా ఐరోపాలో 11 గిగావాట్ల మిశ్రమ ఉత్పత్తితో దాదాపు 5,800 విండ్ టర్బైన్లను ఆఫ్లైన్లో ఉంచినట్లు తెలిసింది.