మెడికల్ క్యాంప్ అంటూ డాక్టర్ ను చీట్ చేసిన సైబర్ మోసగాళ్లు

© File Photo

ఆర్మీ క్యాంపులో మెడికల్ క్యాంప్ పెట్టాలని సైబర్ మోసగాళ్లు ఓ వైద్యుడికి ఫోన్ చేసి రూ.6 లక్షలు లాగేశారు. మారేడుపల్లిలో ఉండే ఈ వైద్యుడికి తాను ఆర్మీలో పనిచేస్తున్నానని 300 మంది ఉన్నామని ఓ కాల్ వచ్చింది. మెడికల్ క్యాంప్ పెట్టాలని ఆ ఖర్చే మేమే భరిస్తామని, డెబిట్ కార్డు వివరాలు తెలుసుకుని చీట్ చేశాడు. మరో యోగా ట్రైనర్ కి ఓ వ్యక్తి ఫోన్ చేసి 500 మందికి యోగా ట్రైనింగ్ ఇవ్వాలంటు రూ.5 లక్షలు కాజేశారు. సరికొత్తగా సైబర్ నేరగాళ్లు ట్రైనర్లను లక్ష్యంగా చేసుకుని మాసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులతోపాటు, శిక్షకులు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Exit mobile version