ఆఫ్రికా దేశమైన మలావిలో ‘ఫ్రెడ్డీ’ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 100మందికి పైగా ప్రజలు మృతిచెందారు. తుపాను ధాటికి నదులు పొంగి పొర్లుతున్నాయి. నీటి వరదలో ప్రజలు కొట్టుకుపోతున్నారు. భవనాలు కూలిపోతున్నాయి. చాలామంది స్థానికులు వరదలో చిక్కుకుపోయారు. వర్షంతో పాటు బలమైన గాలులు వీస్తుండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది తలెత్తుతోంది. బురదలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీయడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గడిచిన నెలలోనూ ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టించింది.