యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్, సలార్, స్పిరిట్ వంటి సినిమాలు ప్రభాస్ డైరీలో ఉన్నాయి. ఇవి కాకుండా ఆయన కామెడీ చిత్రాల దర్శకుడు మారుతితో కూడా ఓ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ 2 లో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. రవితేజ హీరోగా వచ్చిన రాజా ది గ్రేట్ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. పార్ట్ 2 లో ప్రభాస్ అలరించనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో?
-
© File Photo
-
© File Photo