విశ్వక్‌సేన్ డ్యుయల్ రోల్‌లో నటిస్తున్న ‘దాస్ కా ధమ్కీ’ మార్చి 22న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా సౌండ్ మిక్సింగ్ పూర్తి చేసుకుంది. ఇక గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అంటోంది చిత్రబృందం. విశ్వక్‌సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. నివేదా పెత్తురాజ్ విశ్వక్ సరసన నటించింది. లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. వన్మయి క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 17న ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.