డేటా ఎంట్రీ ఉద్యోగాల భర్తీకి నిమ్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక సోషల్ వర్కర్, రెండు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సోషల్ వర్కర్ పోస్టుకు దరఖాస్తుదారులు లైఫ్ సైన్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ణానం తప్పనిసరి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు రూ.19 వేల నుంచి రూ.30 వేల వరకు ఇస్తారు. నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్, తెలంగాణ, 500082 అడ్రస్‌కు ఆఫ్‌లైన్ దరఖాస్తులు పంపాలి. ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.