బెంగుళూరు విమానాశ్రయ అధికారుల పనితీరును డెన్మార్క్‌కి చెందిన వ్యాపారవేత్త కొనియాడారు. హడావుడిలో ఆయన ఎయిర్‌పోర్టులో తన విలువైన చేతి గడియారాన్ని పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారులకు తెలియజేస్తూ మెయిల్ రాశారు. దీంతో కొన్ని గంటల్లోనే వ్యాపారవేత్త వాచ్‌ని అధికారులు వెతికిపెట్టారు. దీంతో అధికారుల నిబద్ధతను వ్యాపారవేత్త కొనియాడుతూ ‘పవర్ ఆఫ్ ఇండియా’ అంటూ కామెంట్ చేశారు. నిజంగా ఇండియా గొప్పదేశమంటూ వ్యాపారవేత్తకు మద్దతుగా పలువురు నెటిజన్లు నిలుస్తున్నారు.
దటీజ్.. ‘పవర్ ఆఫ్ ఇండియా’

© Envato(representational)