ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నేడు నామినేషన్ వేయనున్నారు. ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. మరోపక్క ఒడిషా అధికార పార్టీ బిజూ జనతాదళ్ నుంచి ఇద్దరు సీనియర్ నేతలు, ఏపీలోని వైఎస్సార్ సీపీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి వెళ్లనున్నారు. ద్రౌపది ముర్ము గెలుపు నల్లేరు మీద నడకలానే కనిపిస్తోంది.