సికింద్రాబాద్ నల్లగుట్ట దక్కన్ స్పోర్ట్స్ మాల్ భవనంలో కనిపించకుండా పోయిన యువకుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఇప్పటికే మూడ్రోజులుగా అగ్నిమాపక శాఖ , డీఆర్ఎఫ్ , క్లూస్ టీం సిబ్బంది అన్ని అంతస్తులో తిరుగుతూ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రత్యేక లైట్లు వేసుకొని వెతికినా ఎలాంటి ప్రయోజనం లేదు. గుజరాత్‌కు చెందిన వసీం, జునైద్, జహీర్ గల్లంతవ్వగా..ఒక్కరి అవశేషాలు దొరికాయి. అవి ఇంకా ఎవరివో తెలియలేదు. దాదాపు 10 వేల టన్నుల వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు.