ఉత్తర్‌ప్రదేశ్‌లో విచిత్ర ఘటన జరిగింది. అంత్యక్రియలు పూర్తయ్యే ముందు పాడెపై ఉన్న మహిళ కళ్లు తెరిచింది. అయితే, ఆ మరుసటి రోజే ఆమె మృతిచెందడం గమనార్హం. యూపీలోని ఫిరోజాబాద్‌లో ఓ మహిళ చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆమె అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతిమ సంస్కరణల్లో చివరి ఘట్టానికి వచ్చిన సమయంలో ఆ మహిళ కళ్లు తెరిచింది. దీంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లి సపర్యలు చేశారు. టీ తాగించారు. అంతా బాగుందని అనుకున్నాక 24గంటల్లోనే మహిళ మృతిచెందింది. ఈ ఘటన కలకలం రేపింది.