బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం

© ANI Photo

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్, బెంగాల్‌ తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించింది. మరికొన్ని గంటల్లో ఇది బలపడి వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది.

Exit mobile version