జింబాబ్వే క్రికెట్లో తీరని విషాదం నెలకొంది. రోజుల వ్యవధిలో క్రికెట్ దంపతులు కన్నుమూశారు. జింబాబ్వే మహిళా క్రికెట్ అసిస్టెంట్ కోచ్ సినికివే ఎంపోపు శనివారం తన నివాసంలో కుప్పకూలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సినికివే భర్త, జింబాబ్వే క్రికెట్ పురుషుల జట్టు ఫీల్టింగ్ కోచ్ షెఫర్డ్ ఇటీవలె చనిపోయారు. డిసెంబర్ 15 ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో జింబాబ్వే క్రికెట్ జట్టు శోకసంద్రంలో మునిగిపోయింది.