టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్ ఓ ఇంటి వాడయ్యాడు. తన ప్రియసి జయ భరద్వాజ్‌ను ఆగ్రాలోని ఫైవ్ స్టార్ హోటల్ అయిన జేపీ ప్యాలెస్‌లో అంగరంగా వైభవంగా పరిణయమాడాడు. భజంత్రీల చప్పుళ్ళు, కుటుంబ సభ్యుల కేరింతల నడుమ వారి పెళ్లి చూడముచ్చటైన వేడుకగా జరిగింది. ఈ పెళ్ళికి పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరూలను ఆశీర్వదించారు. కాగా చాహర్ గాయం కారణంగా ఈ ఏడాది చెన్నై తరఫున ఆడలేదు.