నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ప్రాజెక్ట్-K’. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా స్థాయిని పెంచేలా ఉంటుందని భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయన్‌గా నటిస్తున్న దీపికా పదుకొణె లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. దీపిక పుట్టిన రోజు సందర్భంగా ‘చీకటిలో ఆశాకిరణం’ అనే ట్యాగ్‌లైన్‌తో దీపిక ఫోటోను పంచుకున్నారు. హాలివుడ్ స్టైల్లో ఉన్న పోస్టర్ చూసి ఇండియన్ సినిమాను ఏలబోతున్నామంటూ ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.