దీపికా పదుకొణే ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యమిస్తుందో తెలిసిందే. గత 15 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో తన అందాన్ని తన ప్రత్యేకతను కాపాడుకుంటూ టాప్ హీరోయిన్గా వెలుగొందుతోంది. ఇటీవల ఆమె ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జ్యూరీ మెంబర్‌గా ఎన్నికైంది. అయితే ఆమె అందమైన రూపం వెనక ఉన్న రహస్యం యోగా అంటూ తన ఫాలోవర్స్‌తో యోగా చేస్తున్న ఫోటోలను పంచుకుంది. మరి దీపికాను చూసి మీరు యోగాను నేర్చేసుకోండి.