ఆసీస్తో టెస్టు సిరీస్కు ఎంపిక కాకపోవడంపై ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. కచ్చితంగా ఇండియాకు ఆడుతానని చాలామంది చెబుతుండేవారని గుర్తు చేసుకున్నాడు. అయితే, తన ప్రయత్నాన్ని మాత్రం ఆపబోనని స్పష్టం చేశాడు. ‘సెలక్షన్ టీం ప్రకటన అనంతరం తీవ్ర నిరాశ చెందా. అసోం నుంచి ఢిల్లీకి వచ్చా. నాన్నతో మాట్లాడాక కాస్త కుదుటపడ్డా. అయితే, ప్రయత్నాన్ని మాత్రం ఆపను. ప్రాక్టీస్ చేస్తూనే ఉంటా. నన్ను ఎంపిక చేయకపోవడాన్ని ఖండిస్తూ ఎంతో మంది నాకు సందేశాలు పంపించారు. నాకు మద్దతుగా నిలిచారు’ అని సర్ఫరాజ్ ఖాన్ వెల్లడించాడు. ఫిబ్రవరి 9నుంచి ఆసీస్తో సిరీస్ ప్రారంభం అవుతుంది.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం