ఉత్తరప్రదేశ్లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఓడిపోతుందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. “ దశాబ్దాల పాటు అధికారంలో ఉంటామని ఆ పార్టీ చెప్పుకుంటోంది. మరో 50 ఏళ్లు పాలన చేస్తామని వారు ప్రకటించుకుంటున్నారు. అయినప్పటికీ ఇప్పుడు మాత్రం రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని రెండు మెడికల్ కళాశాలలు సందర్శిస్తే వారికే అర్థమవుతోంది. ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తారో వారికే తెలుస్తుంది” అన్నారు.