గత వారం దిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్న వివాదంపై ఎయిరిండియా క్లారిటీ ఇచ్చింది. ఫ్లైట్ ఎక్కేందుకు రెండు నిమిషాలు ఆలస్యమైందనే కారణంతో ఓ మహిళను, ఆమె బంధువులను సెక్యూరిటీ నిలిపివేసిందని, దాంతో ఆమె భయాందోళనకు గురై అక్కడే కింద పడిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయినా కూడ కనికరం లేకుండా కనీసం వైద్య సాయం అందించలేదని బంధువులు ఆరోపించారు. ఈ విషయంపై ఎయిరిండియా స్పందిస్తూ.. సదరు మహిళ ఆరోగ్య స్థితి బాగుందని డాక్టర్ నిర్దారించాకే ఆమెకు వీల్ ఛైర్ అందించలేదని వివరణ ఇచ్చింది.