IPL: కరోనా కంగారు పెట్టినా.. ఉతికారేశారు

© IPL Photos - IPLT20.com

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును కరోనా రక్కసి తీవ్రంగా కంగారు పెట్టింది. అసలు మ్యాచ్ జరుగుతుందా? లేదా? అని అంతా అనుకున్నారు. పూనేలో జరగాల్సిన మ్యాచును చివరికి ముంబైకి మార్చారు. మ్యాచ్ ముందు కూడా ఢిల్లీ జట్టులో ఒక ఆటగాడు కరోనా బారిన పడడంతో ఇక ఈ మ్యాచ్ వాయిదా పడుతుందని అంతా అనుకున్నారు. కానీ బీసీసీఐ మాత్రం ఈ మ్యాచ్ జరిపింది. డీసీ జట్టులో చాలా మందికి కరోనా సోకింది. వారేం రాణిస్తారులే అని అంతా అనుకున్నారు. కానీ డీసీ జట్టు మాత్రం చించేసింది. అరవీర భయంకర బ్యాటింగ్ లైనప్ ఉందని పేరు గాంచిన పంజాబ్ జట్టు ఈ మ్యాచులో మాత్రం పూర్తిగా చతికిలపడిపోయింది. 120 బంతుల్లో 116 పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేసింది. స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన డీసీ జట్టు కేవలం 10.3 ఓవర్లలోనే 116 పరుగులను ఊదేసింది. బ్యాటింగ్ లో విఫలమయింది.. పిచ్ హార్డ్‌గా ఉండొచ్చు. బౌలింగ్‌లో రబడ ఉన్నాడులే అని భావించిన పంజాబ్ అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. దీంతో పంజాబ్ 9 వికెట్ల ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

Exit mobile version