ఐపీఎల్ 2022కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ పెద్ద షాక్ తగలనుంది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ బౌలర్ ఆన్రిచ్ నార్ట్జే దూరమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా, ఢిల్లీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ళలో నార్ట్జే ఒకరు. అతని కోసం రూ.6.5 కోట్లు చెల్లించింది. అతను హిప్ సమస్యతో బాధపడుతున్నాడని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది. గాయం తీవ్రత ఎక్కువ ఉండడంతో బంగ్లాదేశ్ తో సిరీస్ కు అతన్ని ఎంపిక చేయలేదని పేర్కొంది. ఇక, బంగ్లాతో సిరీస్ కారణంగా పలువురు దక్షిణాఫ్రికా ఆటగాళ్ళు మార్చి 26న ప్రారంభమయ్యే ఐపీఎల్ కు కనీసం 3 వారాలు దూరంగా ఉండనున్నారు.