ఢిల్లీలో 501 కోవిడ్ కేసులు న‌మోదు

© ANI Photo

ఢిల్లీలో సోమవారం వరుసగా రెండవ రోజు 500 కంటే ఎక్కువ కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. గ‌త‌ రెండు వారాల నుంచి క‌రోనా కేసుల్లో పెరుగుదల క‌నిపిస్తుంది. అయితే ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య‌, మరణాల రేట్లు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. ఢిల్లీలో అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రి అయిన లోక్ నాయక్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో నలుగురు మాత్ర‌మే అడ్మిట్ అయ్యార‌ని తెలిపారు. ఈ వారం నుంచి రాజ‌ధాని న‌గ‌రంలో మెట్రో స్టేషన్లు, బస్టాప్‌లు, మార్కెట్‌ప్లేస్‌లలో క‌రోనా పరీక్షలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. రాజధానిలో కోవిడ్ పరిస్థితి ఆందోళనకరంగా లేదని నిపుణులు అంగీకరించినప్పటికీ, రాబోయే రోజుల్లో పరిస్థితిని ప్రభుత్వం జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.

Exit mobile version