ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లిన ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్‌పై బదిలీ వేటు పడింది. సంజీవ్ ఖిర్వార్ను లడఖ్‌కు, అతని భార్యను తక్షణమే అరుణాచల్ ప్రదేశ్‌కు తరలించినట్లు హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. త్యాగరాజ్ స్టేడియంలోని సౌకర్యాలను వారు దుర్వినియోగం చేయడంపై వచ్చిన వార్తా నివేదికపై హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నుంచి నివేదికను కోరింది. గురువారం సాయంత్రం హోంశాఖకు ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పించడంతో వారిని బదిలీ చేయాలని మంత్రిత్వ శాఖను ఆదేశించింది.