హైదరాబాద్ కేంద్రంగానే దిల్లీ మద్యం కుంభకోణం జరిగిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఐటీసీ కోహీనూర్ హోటల్‌లో కుట్ర పన్నారని వెల్లడించింది. ఇందులో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించిన ఈటీ.. సౌత్ లాబీపపై పలు విషయాలు వెల్లడించింది. “ సౌత్ గ్రూప్‌లో రామచంద్ర పిళ్లై,సమీర్ మహింద్రు, మాగుంట శ్రీనివాస్‌కు 65 శాతం పార్టనర్ షిప్ ఉంది. సౌత్ గ్రూప్ మెుత్తం 9 జోన్లు కైవసం చేసుకుంది. ఇందులో విజయ్ నాయర్‌ది కీలక పాత్ర. సౌత్ గ్రూప్ లాబీకి సంబంధించి రూ. 100 కోట్లు హవాలా మార్గంలో తరలించారు” అని వెల్లడించింది.