మహిళలపై ఇంకా లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దిల్లీ పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ విషయంపై స్పష్టత తీసుకునేందుకు వెళ్లినట్లు వెల్లడించారు. స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాగర్ ప్రీత్ హుడా నేతృత్వంలో పోలీసుల బృందం తుగ్లక్ లేన్‌లో ఉన్న రాహుల్ నివాసానికి చేరుకుంది. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఆయనకు ఒక ప్రశ్నావళి పంపినట్లు చెప్పారు. లైంంగిక దాడులు ఎదుర్కొన్నామంటూ ఆయన్ని సంప్రదించిన మహిళలెవరో చెప్పాలని కోరారు. తద్వారా మరింత భద్రత కల్పించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.