దేశరాజధాని దిల్లీని వడగండ్ల వాన కుదిపేసింది. తీవ్రగాలులకు వాహనదారులు అవస్థలు పడ్డారు. అనేక చోట్ల చెట్లు కూలిపోయాయి. హోర్డింగులు విరిగిపడ్డాయి. ట్రాకింగ్ వెబ్సైట్లలో అంతరాయంతో విమాన రాకపోకలు ఆలస్యమయ్యాయి. 8 విమానాలకు ప్రతికూల వాతావరణం కారణంగా దారిమళ్లించారు. వాటిని జైపూర్, లఖ్నవూ, చండీగఢ్, అహ్మదాబాద్, డెహ్రాడూన్లకు మళ్లించినట్లు పేర్కొన్నారు.