వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో నేడు గుజరాత్ జెయింట్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉండగా, గుజరాత్ జెయింట్స్ నాలుగో స్థానంలో ఉంది. రెండు జట్ల బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే దిల్లీ జట్టు ఫేవరేట్‌గా కనిపిస్తోంది. మరోవైపు, కిందటి మ్యాచ్‌లో అనుసరించిన గెలుపు పంథానే ఈ దిల్లీతోనూ కొనసాగించాలని గుజరాత్ జెయింట్స్ భావిస్తోంది. నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానం మ్యాచ్‌కు వేదిక కానుంది. రాత్రి 7.30గంటలకు మ్యాచ్ ప్రారంభం.