దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత మళ్లీ క్షీణించింది. గాలి నాణ్యత 301 పాయింట్లకు చేరి ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ విలువ 301 పాయింట్లకు చేరినట్లు స్థానిక కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. ఢిల్లీ శివారు గురుగ్రామ్‌లో ఏకంగా 353 పాయింట్లు నమోదు అయింది. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో 309 పాయింట్లుగా నమోదైంది. పిల్లలు, వృద్ధులు, హృద్రోగులు శ్రమకు దూరంగా ఉండాలని ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ‘సఫర్’ ద్వారా సలహా లు, సూచనలు పొందాలని సూచించింది.