ఓ గర్భిణీకి ప్రసవం చేసి ఆమె కడుపులో టవల్ మరిచిపోయి కుట్లు వేశాడు ఓ డాక్టర్. ఈ సంఘటన యూపీలోని ఆమ్రోహా జిల్లాలోని బన్స్ఖేరీలో చోటుచేసుకుంది. నజ్రానా అనే మహిళ స్థానిక సైపీ నర్సింగ్ హోంలో ప్రసవించింది. డాక్టర్ నత్లూబ్ ఆమెకు డెలివరీ చేసి కుట్లు వేశాడు. కానీ కడుపు నొప్పి ఎక్కువగా ఉందని డాక్టర్తో చెప్పగా చలి కారణంగా అలా ఉంటుందని ఇంటికి పంపించాడు. ఎంతకీ నొప్పి తగ్గకపోవటంతో ఆమె వేరే ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ తీయించగా లోపల టవల్ ఉన్నట్లు గుర్తించి తొలగించారు.