ఏపీలో రాక్షస పాలనను అంతం చేసి.. రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడమే వారాహి యాత్ర లక్ష్యమని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. దుర్గాదేవిని దర్శించుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. బుధవారం బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమ, పూలు, గాజులు సమర్పించారు. ప్రచార రథం వారాహికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పవన్ వెంట జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు.