తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర వేసినట్లుగానే ఆప్ ఎమ్మెల్యేలనూ కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా ఆరోపించారు. ఈ కేసులో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధముంటే.. వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి ఇలా ఉండటం దేశానికి ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. దిల్లీ, పంజాబ్లలో 43మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అడ్డంగా దొరికిపోయిందన్నారు.