భారత్-పాక్ సరిహద్దులో దేశానికి రక్షణగా మరో ఎయిర్‌బేస్ ఏర్పాటు కాబోతోంది.గుజరాత్‌లోని గాంధీనగర్‌లో డిఫెన్స్ ఎక్స్పో-2022ను ప్రారంభించిన ప్రధాని.. ‘దీసా’ వద్ద నిర్మిస్తున్న ఈ స్థావరానికి వర్చువల్‌గా భూమిపూజ చేశారు. సుమారు రూ.1000 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ స్థావరం గగనతల, సముద్ర ఆపరేషన్లు నిర్వహంచేందుకు ఉపయోగపడనుంది. 21 నెలల్లో దీని నిర్మాణం పూర్తికానుంది. డిఫెన్స్ ఎక్స్పో అక్టోబర్ 22 వరకు కొనసాగనుంది.