క్యూబా విప్లవ జ్యోతి చే గువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తేఫానియా గువేరా హైదరాబాద్‌కు వచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ యువజన సంఘాలు వీరికి ఘన స్వాగతం పలికాయి. క్యూబాలో సమాన పనికి సమాన వేతనం, మహిళా ఫెడరేషన్ ఉంటుందన్నారు. ఆడ,మగ వ్యత్యాసం తమ దేశంలో ఉండదన్నారు. నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా(ఎన్‌సీఎస్‌సీ), ఐప్సో(ఏఐపీ ఎస్‌వో)ల సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఇవాళ సాయంత్రం జరగనున్న కార్యక్రమానికి వీరు ముఖ్య అతిథులుగా హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు.