బంగ్లాదేశ్లో హిందూ దేవుళ్లకు అవమానం జరిగింది. బంగ్లాలోని దౌటియా గ్రామంలో ఉన్న కాళి టెంపుల్లోని దేవతామూర్తులను దుండగులు రెండు ముక్కలు చేసి రోడ్డు పక్కన విసిరేశారు. ఇది గమనించిన ఆలయ పాలక మండలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంగ్లాలో ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. విగ్రహారాధన ఇష్టం లేని కొందరు విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతూ.. హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.