మోదీ హయాంలోనే కశ్మీర్ అభివృద్ధి

© ANI Photo

ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే జమ్ముకశ్మీర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. రాజౌరిలో ఆయన మాట్లాడుతూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేస్తే రక్తపాతం జరుగుతుందని కొందరు భయపెట్టారని, కానీ ఇక్కడ జరిగిన అభివృద్దే వారి నోర్లు మూయించిందన్నారు. కశ్మీర్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పెంచామని, పాఠశాలలు, కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు.

Exit mobile version